న్యూఢిల్లీ: పార్లమెంట్లో ‘ప్రేరణ స్థల్’ను ఉప రాష్ట్రపతి ధనకర్ ఆదివారం ప్రారంభించారు. ఇప్పటి వరకు పార్లమెంట్ పరిసరాల్లో వివిధ చోట్ల ఉన్న గాంధీ, అంబేద్కర్ సహా జాతీయ ప్రముఖులు, స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలన్నింటినీ ఒక్కచోటకు మార్చారు. ఈ ప్రేరణ స్థల్ ప్రజలకు స్ఫూర్తి, ప్రేరణను ఇస్తుందని ధనకర్ పేర్కొన్నారు. విగ్రహాల తరలింపు కేంద్రం ఏకపక్ష నిర్ణయమని కాంగ్రెస్ విమర్శించింది.