అహ్మదాబాద్, ఆగస్టు 7: వచ్చే లోక్సభ ఎన్నికల్లో గుజరాత్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేయనున్నట్టు ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు ఇషుదాన్ గాద్వి చెప్పారు. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని, ఈ చర్చలు ఫలప్రదమైతే కచ్చితంగా కలిసి పోటీ చేస్తామని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందిస్తూ పార్టీ అగ్ర నాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వెల్లడించింది.