గురువారం 26 నవంబర్ 2020
National - Nov 20, 2020 , 17:50:56

క‌రోనా కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ఢిల్లీలో ఇంటింటి స‌ర్వే

క‌రోనా కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ఢిల్లీలో ఇంటింటి స‌ర్వే

న్యూఢిల్లీ: ఢిల్లీలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ విజృంభిస్తుండ‌టంతో దానిని క‌ట్ట‌డి చేసేందుకు ఢిల్లీ స‌ర్కారు చ‌ర్య‌లు చేప‌ట్టింది. క‌రోనా క‌ట్ట‌డి కోసం కంటైన్‌మెంట్ జోన్‌ల‌లో కాంటాక్ట్ ట్రేసింగ్‌, ఇంటింటి స‌ర్వే చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపింది. ఢిల్లీలో క‌రోనా మ‌హ‌మ్మారి థ‌ర్డ్ వేవ్ ప్రారంభానికి ముందే కాంటాక్ట్ ట్రేసింగ్ మొద‌లుపెట్టామ‌ని, ప్ర‌స్తుతం అది భారీ ఎత్తున కొన‌సాగుతున్న‌ద‌ని ఢిల్లీ ఆరోగ్య‌శాఖ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్ వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం క‌రోనా ల‌క్ష‌ణాలున్న పేషేంట్ల‌ను గుర్తించేందుకు ఇంటింటి స‌ర్వే చేప‌ట్టామ‌ని ఆయ‌న చెప్పారు.

క‌రోనా కేసులు విజృంభిస్తుండ‌టంతో ఈ చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ఆరోగ్య‌మంత్రి స‌త్యేంద‌ర్ జైన్‌ పేర్కొన్నారు. కాగా, గురువారం ఢిల్లీలో 7,546 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. మ‌రో 98 మంది క‌రోనా బాధితులు మృతిచెందారు. దీంతో ఢిల్లీలో మొత్తం క‌రోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,10,630కి చేరింది. మ‌ర‌ణాలు 8,041కి పెరిగాయి.      

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.