న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. జహంగీర్ ప్రాంతంలో ఇద్దరు అనుమానితులను ఢిల్లీ పోలీస్ ప్రత్యక విభాగం గురువారం అదుపులోకి తీసుకున్నది. ఇద్దరు జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు దేశ రాజధానిలో పెద్ద కుట్రకు ప్లాన్ చేసినట్లు సమాచారం. పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరిలో ఒకరికి కెనడాలో ఉన్న ఖలస్తానీ ఉగ్రవాది అర్హ్‌దీప్ దల్లాకు సహాయకుడితో బంధుత్వం ఉన్నట్లు తెలిసింది. ఇద్దరు లక్షితదాడులకు ప్లాన్ చేసినట్లు సమాచారం. నిందితుల మొబైల్ నుంచి ఉగ్రవాదుల ప్లాన్ బ్లూప్రింట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అర్ష్‌దీప్ దల్లా ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్‌కి చెందిన ఉగ్రవాది. ఇదిలా ఉండగా.. అర్ష్‌దీప్ దల్లాను రెండు రోజుల కిందట హోంమంత్రిత్వ శాఖ ఉగ్రవాదిగా ప్రకటించిన విషయం తెలిసిందే.