కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసు | ఈశ్వరప్ప రాజీనామా కోరుతూ కాంగ్రెస్ నిరసన హోరు
కర్నాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై అవినీతి ఆరోపణలు చేసిన అనంతరం కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై కాంగ్రెస్ పార్టీ నిరసనలతో హోరెత్తిస్తోంది.
బెంగళూర్ : కర్నాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై అవినీతి ఆరోపణలు చేసిన అనంతరం కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై కాంగ్రెస్ పార్టీ నిరసనలతో హోరెత్తిస్తోంది. మంత్రి ఈశ్వరప్ప రాజీనామాకు డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి బసవ్రాజ్ బొమ్మై నివాసానికి ప్రదర్శనగా బయలుదేరిన కాంగ్రెస్ నేతలు డీకే శివకుమార్, సిద్ధరామయ్య సహా పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు అవినీతి ఆరోపణలపై కర్నాటక మంత్రి కే ఈశ్వరప్పపై వేటు వేయాలని కోరుతూ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన సెగలు ఢిల్లీని తాకాయి. సంతోష్ పాటిల్ బలవన్మరణానికి బాధ్యుడైన ఈశ్వరప్పను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసం వద్ద యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు మిన్నంటాయి.
ఇక ఓ కాంట్రాక్టు వ్యవహారంలో మంత్రి ఈశ్వరప్ప తనను 30 శాతం కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశాడని బీజేపీ కార్యకర్త కూడా అయిన సంతోష్ పాటిల్ సూసైడ్ నోట్లో పేర్కొనడం కలకలం రేపింది. కాగా తనకు కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఎవరో తెలియదని మంత్రి ఈశ్వరప్ప తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

