Himachal Pradesh | హిమాచల్‌లో హైడ్రామా.. కాంగ్రెస్ సర్కార్‌ను సంక్షోభంలోకి నెట్టిన రాజ్యసభ ఎన్నికలు
రాజ్యసభ ఎన్నికలు హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ సర్కార్‌ను సంక్షోభంలోకి నెట్టాయి. సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ మెజార్టీ కోల్పోయిందని, విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రస్తుత సర్కార్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మంత్రి విక్రమాదిత్య సింగ్ బుధవారం ఉదయం తన పదవికి రాజీనామా చేశారు.
- పతనం అంచున కాంగ్రెస్ ప్రభుత్వం!
- మంత్రి విక్రమాదిత్యసింగ్ రాజీనామా.. అనంతరం వెనక్కి
- కాంగ్రెస్ మెజార్టీ నిరూపించుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్
- సిమ్లాకు ముగ్గురు పరిశీలకులను పంపిన కాంగ్రెస్ అధిష్ఠానం
- ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బయటకు పంపి.. బడ్జెట్‌కు ఆమోదం
Himachal Pradesh | సిమ్లా, ఫిబ్రవరి 28: రాజ్యసభ ఎన్నికలు హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ సర్కార్‌ను సంక్షోభంలోకి నెట్టాయి. సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ మెజార్టీ కోల్పోయిందని, విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రస్తుత సర్కార్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మంత్రి విక్రమాదిత్య సింగ్ బుధవారం ఉదయం తన పదవికి రాజీనామా చేశారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం పంపిన పరిశీలకులతో చర్చల అనంతరం తన రాజీనామాను విక్రమాదిత్య వెనక్కి తీసుకున్నారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ సర్కార్ బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.‘జై శ్రీరామ్..బన్‌గయా కామ్..’అంటూ కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులు సభలో అడుగుపెట్టారు.
మంగళవారం రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసిన తర్వాత ఈ 9మంది ఎమ్మెల్యేలు హర్యానాలోని పంచకులకు వెళ్లిపోయారు. అక్కడ వారికి బీజేపీ సర్కార్ కట్టుదిట్టమైన భద్రత కల్పించటం గమనార్హం. బుధవారం బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు హెలికాప్టర్లో సిమ్లాకు చేరుకున్నారు. బడ్జెట్ సమావేశాల్ని బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. ముందు కాంగ్రెస్ సర్కార్ తన మెజార్టీ నిరూపించుకోవాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.15 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బయటకు పంపి.. రాష్ట్ర బడ్జెట్‌ను మూజువాణి పద్ధతిలో ఆమోదించారు. ఆ తర్వాత సభను స్పీకర్ నిరవధిక వాయిదా వేశారు. దీని కంటే ముందు బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రతాప్ శుక్లాను కలుసుకొని, కాంగ్రెస్ సర్కార్ మెజార్టీ నిరూపించుకోవాలని గవర్నర్‌ను కోరారు. మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న తరుణంలో తాజా పరిణామాలు కాంగ్రెస్‌ను ఇరకాటంలో పడేశాయి.
రాజీనామా చేసేది లేదు
రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సీఎం పదవికి సుఖ్విందర్ రాజీనామా చేయనున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే వీటిని సుఖు ఖండించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ, తాను సీఎం పదవికి రాజీనామా చేయటం లేదన్నారు.
నష్ట నివారణ చర్యల్లో అధిష్ఠానం
ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటేయటంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఉలిక్కిపడింది. వెంటనే నష్టనివారణ చర్యలకు దిగింది. సీఎం అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్న ఆరుగురు ఎమ్మెల్యేలతో చర్చించేందుకు సీనియర్ నేతలు భూపిందర్ సింగ్ హుడా, డీకే శివకుమార్, భూపేశ్ బఘేల్‌లను సిమ్లాకు పంపింది. 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి 2022లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-40, బీజేపీ-25, స్వతంత్రులు-3 స్థానాలు గెలుచుకున్నారు. తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటంతో కాంగ్రెస్ బలం 34కు తగ్గిందని సమాచారం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

