బీసీ హాస్టల్లో టెన్త్ విద్యార్థి ఆత్మహత్య
సిద్దిపేట జిల్లా వర్గల్‌లోని బీసీ హాస్టల్లో బుధవారం పదోతరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
- సిద్దిపేట జిల్లా వర్గల్లో ఘటన
వర్గల్, నవంబర్ 4 : సిద్దిపేట జిల్లా వర్గల్‌లోని బీసీ హాస్టల్లో బుధవారం పదోతరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మర్కూక్ మండలం పాతూర్కు చెందిన ఆరె రాంచరణ్ (15) వర్గల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతూ, బీసీ హాస్టల్లో ఉంటున్నాడు. దసరా సెలవులు ముగించుకొని హాస్టల్‌కు వచ్చిన రాంచరణ్‌ను ఉపాధ్యాయుడు మందలించడంతో బుధవారం స్కూల్ నుంచి ఎవరికీ చెప్పకుండా హాస్టల్‌కు చేరుకున్నాడు. తాను ఉంటున్న గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. హాస్టల్ వార్డెన్ నర్సింలు గమనించి పోలీసులకు, విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు, వార్డెన్, ఉపాధ్యాయుల సమాచారం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

