ఎనర్జీ డ్రింక్‌లపై రగడ
అధిక కేఫీన్ ఉన్న పానీయాలను ‘ఎనర్జీ డ్రింక్'లుగా విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నాయని పెప్సీకో, మాన్స్టర్ బేవరేజ్లపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పత్రాల్లో పేర్కొన్నట్టు తెలుస్తున్నది.
- పెప్సీకో, మాన్స్టర్ లేబులింగ్‌పై ఎఫ్ఎస్ఎస్ఏఐ అభ్యంతరం
న్యూఢిల్లీ, నవంబర్ 4: అధిక కేఫీన్ ఉన్న పానీయాలను ‘ఎనర్జీ డ్రింక్’లుగా విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నాయని పెప్సీకో, మాన్స్టర్ బేవరేజ్లపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పత్రాల్లో పేర్కొన్నట్టు తెలుస్తున్నది. ‘ఎనర్జీ డ్రింక్’ పదం వినియోగంపై నిషేధాన్ని సమర్థించే క్రమంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ తన వైఖరిని మరింత కఠినతరం చేసినట్టు ఈ పత్రాలు వెల్లడిస్తున్నాయి.
2017లో విడుదల చేసిన స్టింగ్ పానీయాన్ని దేశీయ మార్కెట్లో ఎనర్జీ డ్రింక్‌గా విస్తృతంగా పరిచయం చేసిన పెప్సీకో, మాన్స్టర్ బేవరేజ్‌లు.. ఈ ఏడాది జూన్‌లో వచ్చిన ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్ణయాన్ని వేర్వేరుగా కోర్టులో సవాల్ చేశాయి. ‘ఎనర్జీ డ్రింక్’ పదాన్ని ఉపయోగించొద్దన్న నిర్ణయం తీసుకునే ముందు తమకు హెచ్చరిక ఇవ్వలేదని, తమ వాదన వినేందుకు అవకాశం కల్పించలేదని ఆ కంపెనీలు వాదించాయి. దీంతో ఢిల్లీ హైకోర్టు పాత స్టాక్‌పై ఉన్న ‘ఎనర్జీ డ్రింక్’ లేబుళ్లతో అమ్మకాలు పూర్తిచేసుకునేందుకు కంపెనీలకు అనుమతిచ్చింది. ఈ కేసు విచారణ ఈ వారం చివర్లో జరుగనున్నది. కాగా, బిలియనీర్ ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ కన్స్యూమర్‌తో పాటు రెడ్‌బుల్, హెల్ ఎనర్జీ సంస్థలు కూడా ఈ వివాదంలో దావాలు వేశాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

