కరువుపై సైలెన్స్.. గ్లోబల్ సమ్మిట్‌కు సై!
రాష్ట్రంలోని కరువు పరిస్థితులు, రైతుల కష్టాలను పరిష్కరించడం కన్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్లోబల్ సమ్మిట్ నిర్వహణపైనే ఎక్కువ మక్కువ ఉన్నది.
- కరువుపై సైలెన్స్.. గ్లోబల్ సమ్మిట్‌కు సై!
- కరువును పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం
- ఒక్కసారైనా చర్చించని రాష్ట్ర క్యాబినెట్
- గ్లోబల్ సమ్మిట్ కోసం మాత్రం భేటీకి రెడీ
- నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కరువు పరిస్థితులు, రైతుల కష్టాలను పరిష్కరించడం కన్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్లోబల్ సమ్మిట్ నిర్వహణపైనే ఎక్కువ మక్కువ ఉన్నది. ప్రజలు, రైతులు ఏమైనా పర్వాలేదు కానీ, గ్లోబల్ సమ్మిట్‌ను మాత్రం విజయవంతం చేయాలనే పట్టుదలతో ఉన్నది. ఇందులో భాగంగానే గ్లోబల్ సమ్మిట్‌పై చర్చించేందుకు ప్రత్యేకంగా క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటుచేసింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో మంత్రిమండలి సమావేశం కానున్నది.
ఈ భేటీలో ప్రత్యేకంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహణపైనే చర్చించనున్నట్టు పేర్కొన్నది. ఈ నేపథ్యంలో సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణపై చర్చించేందుకు ప్రత్యేకంగా క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తున్న ప్రభుత్వం.. రాష్ట్రంలో కరువు తాండవం చేస్తున్నా, రైతులు రూ.వేల కోట్లు నష్టపోతున్నా ఏ మాత్రం పట్టించుకోవడంలేదని ప్రజలు మండిపడుతున్నారు. కరువుపై ప్రత్యేక క్యాబినెట్ సమావేశం ఎందుకు నిర్వహించలేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇదేనా రైతులు, ప్రజలపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అక్టోబర్ 15న అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమైన సీఎం రేవంత్‌రెడ్డి.. కరువుపై ఎప్పుడూ క్యాబినెట్ సమావేశమే నిర్వహించలేదు. కానీ గ్లోబల్ సమ్మిట్‌పై మాత్రం ప్రత్యేకంగా క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తుండటం గమనార్హం. విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగి ఉత్తర్వులను మార్చింది. మొదటి ఉత్తర్వుల్లో గ్లోబల్ సమ్మిట్‌పై చర్చించనున్నట్టు పేర్నొన్న సీఎస్.. రెండో దాంట్లో సాధారణ సమావేశంగా పేర్కొనడం గమనార్హం. మొదట సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు అని చెప్పి, రెండోసారి సాయంత్రం 4 గంటలకు అని మార్చడం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

