(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు దొరక్క మల్లగుల్లాలు పడుతున్న కాంగ్రెస్.. మధ్యప్రదేశ్‌లో బీజేపీ నేతకు టికెటిచ్చింది. తీరా ఆ బీజేపీ నాయకుడు తాను టికెట్ కోసం దరఖాస్తే పెట్టుకోలేదని, తాను బీజేపీని వీడనని ప్రకటించడంతో కాంగ్రెస్ అభాసుపాలైంది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తాజా లిస్టులో అశోక్‌నగర్ అసెంబ్లీ అభ్యర్థిగా బీజేపీ నేత దీపక్ పాలీవాల్ను ప్రకటించింది.