బెంగళూర్ : సాయం కోసం వచ్చిన మహిళను కర్నాటక గృహనిర్మాణ శాఖ మంత్రి వి సోమన్న చెంపదెబ్బ కొట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. చామరాజనగర్ గుండ్లుపేట్‌లో మహిళ పట్ల కాషాయ మంత్రి దురుసుగా ప్రవర్తించడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి.
మహిళ పట్ల అనుచితంగా వ్యవమరించిన మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) ఇండ్ల పత్రాలు ఇస్తున్న క్రమంలో సాయం కోసం అభ్యర్ధించిన మహిళపై అసహనానికి లోనైన మంత్రి చెంపదెబ్బ కొట్టడం కలకలం రేపింది.
K'taka BJP minister V Somanna @VSOMANNA_BJP slaps women who came to tell her grievance.
Is this how @BJP4India treats women ?
Somanna must resign #ResignSomanna #SackSomanna pic.twitter.com/EVPNpzKCY2
— Deepak (@Deepak_Ramaiah) October 23, 2022
కర్నాటకలో బీజేపీ మంత్రులు, నేతలకు అహంకారం నెత్తికెక్కిందని ఇంతజరిగినా మన ప్రధాని ఎక్కడున్నారు…బొమ్మై ఈ మంత్రిపై వేటు వేస్తారా ..? అంటూ కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జీవాలా ట్వీట్లో నిలదీశారు. కాషాయ నేత ప్రవర్తనను ఎలా సహిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను జనతాదళ్ (ఎస్) ప్రతినిధి తన్వీర్ అహ్మద్ ప్రశ్నించారు. మహిళ పట్ల మంత్రి ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.