జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ శనివారం 33 మంది అభ్యర్థులతో మొదటి లిస్టు విడుదల చేసింది. బీజేపీ 83 మంది సభ్యులతో విడుదల చేసిన రెండో జాబితాలో మాజీ సీఎం వసుంధర రాజేకు స్థానం కల్పించింది. కాంగ్రెస్ లిస్టులో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌కు చోటు దక్కింది. వసుంధర రాజే ఝల్రాపటాన్ నుంచే తిరిగి పోటీ చేస్తున్నారు. మహారాజా ప్రతాప్ సింగ్ వారసుడు విశ్వనాథ్ సింగ్ మేవాడ్‌ను నాథ్ద్వార నుంచి పోటీలోకి దించారు. తొలుత సీటును నిరాకరించిన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నర్పత్ సింగ్‌కు రెండో లిస్టులో స్థానం కల్పించారు.