రాయ్పూర్: ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 30 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. జాబితాలో ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్, ఉపముఖ్యమంత్రి టీఎస్ సింగ్ డియో పేర్లు కూడా ఉన్నాయి.
భూపేష్ బఘేల్ పఠాన్ అసెంబ్లీ స్థానం నుంచి, టీఎస్ సింగ్ డియో అంబికాపూర్ నుంచి బరిలో దిగనున్నారు. కాగా, 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్గఢ్లో మిగతా 60 స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు ఏఐసీసీ తెలిపింది. కాగా నవంబర్ 7, 17 తేదీల్లో రెండు విడతలుగా ఛత్తీస్గఢ్లో పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.
Congress releases a list of 30 candidates for the upcoming election in Chhattisgarh
CM Bhupesh Baghel to contest from Patan, Deputy CM TS Singh Deo from Ambikapur pic.twitter.com/GYwidZZZis
— ANI (@ANI) October 15, 2023