UP Polls : యూపీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ సీనియర్ నేత, జీ 23 జాబితాలో అగ్రభాగాన ఉన్నగులాంనబీ ఆజాద్‌ను స్టార్ క్యాంపెయినర్‌గా ప్రకటించింది. యూపీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధిష్ఠానం రెండో విడత ప్రచారంలో భాగంగా స్టార్ క్యాంపెయినర్ జాబితాను విడుదల చేసింది. అయితే అందులో సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ పేరును పొందుపరచడం గమనించాల్సిన అంశం. రాజ్యసభ పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న తర్వాత గులాంనబీ ఆజాద్ పార్టీ అధిష్ఠానానికి కాస్త దూరమయ్యారు.
రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పజెప్పే విషయంపై ఆయన అధిష్ఠానంతో విభేదించారు. అంతేకాకుండా జీ 23 జాబితాలో కూడా చేరిపోయారు. అప్పటి నుంచి ఆయనకూ, అధిష్ఠానానికి కొంత గ్యాప్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఈ అంశాలతో పాటు తాజాగా కేంద్రం ఆజాద్‌కు పద్మ అవార్డు ప్రకటించింది. ఈ విషయంలో కూడా కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. కొందరు ఈ విషయంలో విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే, మరో వర్గం మాత్రం స్వాగతం చెబుతోంది. ఈ నేపథ్యంలో గులాంనబీ ఆజాద్ పేరు స్టార్ క్యాంపెయినర్ జాబితాలో రావడం గమనించాల్సిన అంశమే. ఇక నటుడు, సీనియర్ నేత రాజ్‌బబ్బర్ కూడా ఈ జాబితాలో వున్నారు. ఆయన సమాజ్‌వాదీలో చేరిపోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన పేరు కూడా వుండటం గమనించాల్సిన అంశమే. ఇక.. జాబితాలోని మరి కొందరి ప్రముఖుల పేర్లు…