Mallikarjun Kharge | జైపూర్: తక్కువ కులానికి చెందిన, అంటరాని వారనే కారణంతోనే అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను నూతన పార్లమెంటు భవనం శంకుస్థాపనకు బీజేపీ సర్కార్ ఆహ్వానించలేదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. జైపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మోదీ సర్కార్‌పై మండిపడ్డారు. అంటరానివారు శంకుస్థాపన చేస్తే గంగాజలంతో శుద్ధి చేయాలనేది ప్రభుత్వ పెద్దల ఉద్దేశం కావచ్చునని ఆరోపించారు. ఈ కారణంతోనే నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా పక్కనపెట్టారని పేర్కొన్నారు.