బీజేపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆ పార్టీ నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ రాజ్యాంగంలోని మొదటి పేజీని ఆయన ట్వీట్ చేస్తూ విమర్శలు చేశారు. రాజ్యాంగంలో పేర్కొన్న దాని ప్రకారం మీ పార్టీ నడుస్తోందా? అంటూ థరూర్ ప్రశ్నించారు. ఇది కూడా బూటకపు వాగ్దానాల్లో ఒకటేనా? అంటూ సూటిగా ప్రశ్నించారు.
బీజేపీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. 42 వ ఒడిలోకి ప్రవేశించావు. మీ సొంత రాజ్యాంగానికి అనుగుణంగా ప్రవర్తించాల్సిన సమయం కదా ఇది. మీ పార్టీ రాజ్యాంగంలోని మొదటి పేజీలో వున్న వాటిని ఏమాత్రం ఆచరించడం లేదు. ఈ పార్టీ రాజ్యాంగం కూడా జుమ్లాయేనా? అంటూ శశి థరూర్ సూటిగా ప్రశ్నించారు.