Priyanka Gandhi : కాంగ్రెస్ పార్టీ (Congress Party) జాతీయ కార్యదర్శి, వాయనాడ్ ఎంపీ (Wayanad) ప్రియాంకాగాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) లోక్‌సభ (Lok Sabha) లో తొలిసారి ప్రసంగించారు. ఇటీవల మహారాష్ట్ర (Maharastra) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) తోపాటు కేరళ (Kerala) లోని వాయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రియాంకాగాంధీ నాలుగు లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించారు. గతంలో ఆమె పార్టీ కోసం పనిచేశారే తప్ప ఎన్నడూ ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీచేయలేరు.
గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ తన సిట్టింగ్ స్థానమైన వాయనాడ్‌తోపాటు, ఉత్తరప్రదేశ్‌లోని తన తల్లి సోనియాగాంధీ సిట్టింగ్ స్థానమైన రాయ్‌బరేలీ నుంచి కూడా బరిలో దిగారు. రెండు చోట్ల విజయం సాధించారు. రెండింటిలో ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి రావడంతో వాయనాడ్‌ను వదులుకున్నారు. అక్కడి నుంచి తన సోదరి ప్రియాంకాగాంధీని పోటీ చేయించి గెలిపించుకున్నారు.
దాంతో ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమె తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. ఇవాళ ఆమె తన తొలి ప్రసంగం చేశారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇవాళ లోక్‌సభలో ప్రత్యేక చర్చ చేపట్టారు. ఈ చర్చలో భాగంగా ప్రియాంకాగాంధీ సభలో తన ప్రసంగం వినిపించారు.