Gaurav Gogoi : అస్సాం (Assam) ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PCC) అధ్యక్షుడిగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) నియమితులయ్యారు. అస్సాం పీసీసీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఇతర కమిటీల అధ్యక్షులను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ (Congress party) ఒక ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) పేరుతో ప్రకటన విడుదలైంది.
పీసీసీ అధ్యక్షుడిగా గౌరవ్ గొగోయ్ నియమితులు కాగా.. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా జాకీర్ హుస్సేన్ సిక్దర్, రోజ్లినా టిర్కీ, ప్రదీప్ సర్కార్లను నియమించారు. ఇప్పటివరకు పీసీసీ అధ్యక్షుడిగా భూపేన్ కుమార్ బోరా చేసిన సేవలను ఆ ప్రకటనలో పార్టీ మెచ్చుకుంది. వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితురాలైన రోజ్లినా టిర్కీని ఏఐసీసీ సెక్రెటరీ పదవి నుంచి తప్పించారు.
పై నియామకాలతోపాటు వివిధ కమిటీ ఛైర్పర్సన్ల నియామకాలకు కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదం తెలిపారని ప్రకటనలో కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. క్యాంపెయిన్ కమిటీ ఛైర్మన్గా భూపేన్ కుమార్ బోరా, కోఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్గా దేవవ్రత సైకియా, మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్గా ప్రద్యుత్ బర్దోలోయ్, పబ్లిసిటీ కమిటీ ఛైర్మన్గా రకీబుల్ హుస్సేన్ను నియమించారు.