కర్ణాటక అసెంబ్లీలో రాత్రంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసన
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో రాత్రంతా నిరసన చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ఏదో ఒక రోజు ఢిల్లీలోని ఎర్ర కోట వద్ద కాషాయ జెండా ఎగురుతుందన్న రాష్ట్ర మంత్రి కేఎస్ ఈశ్వరప్ప వ్యాఖ్యలపై వారు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి అనూహ్యంగా అసెంబ్లీలో నిరసనకు దిగారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య, ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీ శివకుమార్‌తో సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో బైఠాయించారు.
కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే సీఎం బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎం బీఎస్ యెడియూరప్ప, అసెంబ్లీ స్పీకర్, కొందరు మంత్రులు వెంటనే అసెంబ్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ నేతలకు నచ్చజెప్పి నిరసనను విరమింపజేసేందుకు ప్రయత్నించారు. అయితే కాంగ్రెస్ సభ్యులు ససేమిరా అన్నారు. మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దీంతో సీఎం బసవరాజ్ బొమ్మె, మాజీ సీఎం బీఎస్ యెడియూరప్ప అనంతరం మీడియాతో మాట్లాడారు. నిరసనను విరమించుకోవాలని ప్రతిపక్ష పార్టీ సభ్యులను ఒప్పించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. అయితే వారు అంగీకరించలేదన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మరోసారి కాంగ్రెస్ సభ్యులతో మాట్లాడతామని చెప్పారు. నిరసనను విరమింపజేసేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

