దావణగెరె(కర్ణాటక), మార్చి 2: ఈ ఏడాది చివరిలో కర్ణాటకలో నాయకత్వ మార్పు జరుగుతుందంటూ జోరుగా ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో డిసెంబర్ నాటికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బాధ్యతలు చేపడతారని కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజు వీ శివగంగ ఆదివారం వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయం ఖాయమని, డిసెంబర్ నుంచి మరో ఏడున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవిలో డీకే కొనసాగతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
డిసెంబర్లో ఇది జరిగి తీరుతుందని, తన మాటలు రాసిపెట్టుకోవాలని ఆయన సవాలు చేశారు. రాష్ట్రంలో అధికార పంపకంపై ఒప్పందం ఏదైనా జరిగిందా అన్న విలేకరుల ప్రశ్నకు ఆయన సూటిగాసమాధానమివ్వలేదు. డీకేకి న్యాయ ం జరగని పక్షంలో కాంగ్రెస్ పార్టీలో ఉండడంలో అర్థం లేదని ఆయన అన్నారు. డీకే కృషి వల్లే 75-80 మంది కొత్త వారు ఎన్నికయ్యామని, పార్టీకి ఆయన అవసరం చాలా ఉందని పేర్కొన్నారు.