న్యూఢిల్లీ : వివిధ రాష్ట్రాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లలో జరిగిన ఉప ఎన్నికల్లో (Bye Polls) కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. తమిళనాడులోని ఈరోడ్ ఈస్ట్, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్దిఘి నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇక జార్ఖండ్‌లోని రామ్‌ఘఢ్ స్ధానంలో ఏజేఎస్‌యూ అభ్యర్ధి సునీతా చౌధరి ఆధిక్యంలో ఉంది. ఈ స్దానానికి ప్రాతినిధ్యం వహించిన మమతా దేవిపై అనర్హత వేటు పడటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఇక పుణే, అరుణాచల్ ప్రదేశ్‌లోని లుమ్లా స్దానాల్లో బీజేపీ అభ్యర్ధులు స్వల్ప ఆధిక్యం కనబరుస్తున్నారు. పుణేలోని కస్బా పేట్, చించ్వాద్ ఎమ్మెల్యేలు ముక్తా తిలక్, లక్ష్మణ్ జగ్తాప్ల మరణంతో ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా సాగర్దిఘిలో కాంగ్రెస్ అభ్యర్ధి ఆధిక్యంలో దూసుకుపోతుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలారు.
Read More :