రాయ్పూర్ : చత్తీస్ఘఢ్లోని కైరాఘఢ్ అసెంబ్లీ స్ధానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. చత్తీస్ఘఢ్లో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్ధానాలకు గాను 68 స్ధానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి పాలనా పగ్గాలు చేపట్టింది. బీజేపీ కేవలం 15 స్ధానాలకు పరిమితమైంది.
జేసీసీ(జే), బీఎస్పీ వరుసగా ఐదు, రెండు స్ధానాలను దక్కించుకున్నాయి. ఆపై జరిగిన ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్ధులు గెలుపొందడంతో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ బలం 70కి పెరిగింది. ఇక బిహార్లోని బొచాహన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్ధి అమర్ కుమార్ పాశ్వాన్ ముందంజలో ఉన్నారు.
ఆయన బీజేపీ అభ్యర్ధిని బేబీ కుమారిపై 21,049 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ నుంచి టీఎంసీ అభ్యర్ధి శత్రుఘ్న సిన్హా, బల్లీగంజ్ స్ధానం నుంచి టీఎంసీ అభ్యర్ధి బాబుల్ సుప్రియో సమీప బీజేపీ అభ్యర్ధులపై ముందంజలో ఉన్నారు.