Sonia Gandhi | న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని సర్ గంగా రామ్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆదివారం రాత్రి ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఇవాళ సోనియా ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి చైర్మన్ అజయ్ స్వరూప్ మాట్లాడారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు సహకరిస్తున్నారని పేర్కొన్నారు. ఉదర సంబంధిత సమస్య నుంచి ఆమె పూర్తిగా కోలుకుంటున్నారని తెలిపారు. ఆమె డైట్‌ను పూర్తిగా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.
సోనియా గాంధీ డిశ్చార్జి తేదీని ఇంకా నిర్ణయించలేదన్నారు. డాక్టర్ ఎస్ నండే, డాక్టర్ అమితాబ్ యాదవ్ సోనియా ఆరోగ్య పరిస్థితితో పాటు డైట్‌ను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. జూన్ 9వ తేదీన మెడికల్ చెకప్ నిమిత్తం సోనియా ఆస్పత్రికి వెళ్లిన విషయం విదితమే.