న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. కొద్దిగా జ్వరం రావడంతో శనివారం సాయంత్రం ఆమెను శ్రీ గంగారామ్ దవాఖానలో చేర్చారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని దవాఖాన సీనియర్ డాక్టర్ తెలిపారు. ఆమెకు స్వల్పంగా జ్వరం ఉన్నప్పటికీ బాగానే ఉన్నారని, ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నట్టు ఆయన చెప్పారు.