anti-Sikh riots case | సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో.. కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ నిర్దోషి
anti-Sikh riots case | సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో (anti-Sikh riots case) కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్ కుమార్, ఇతర నిందితులను నిర్దోషులుగా కోర్టు పేర్కొంది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఈ మేరకు బుధవారం తీర్పు ఇచ్చింది.
న్యూఢిల్లీ: సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో (anti-Sikh riots case) కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్ కుమార్, ఇతర నిందితులను నిర్దోషులుగా కోర్టు పేర్కొంది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఈ మేరకు బుధవారం తీర్పు ఇచ్చింది. 1984లో సుల్తాన్‌పురి ప్రాంతంలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో ఆరుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌తో సహా ఐదుగురు నిందితులపై కేసు నమోదైంది. అల్లర్ల సమయంలో నిందితులు గురుద్వారాకు నిప్పంటించినట్లు వారిపై అభియోగాలు మోపారు. విచారణ సమయంలో ఇద్దరు నిందితులు చనిపోయారు.
కాగా, గత నెలలో ఈ కేసుపై విచారణ సందర్భంగా అల్లర్లు ప్రేరేపించిన ప్రాథమిక వ్యక్తిగా సజ్జన్ కుమార్‌ను కోర్టు గుర్తించింది. హింసాత్మక మూకలో ఆయన కూడా ఉన్నట్లు పేర్కొంది. ఆ ప్రాంతంలోని సిక్కుల ఇళ్లను తగులబెట్టాలని ఆ గుంపు భావించినట్లు కోర్టు అభిప్రాయపడింది. అయితే బుధవారం నాటి తీర్పులో నిందితులను నిర్దోషులుగా కోర్టు పేర్కొంది. మరోవైపు ఇదే కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్‌పై విచారణను అక్టోబర్ 13కు రోస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

