న్యూఢిల్లీ: హెలిక్యాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌కు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఘనంగా నివాళులు అర్పించారు. బిపిన్ రావత్, ఆయన సతీమణి మధూలిక రావత్ భౌతిక కాయాలపై పుష్పగుఛ్చాలుంచి అంజలి ఘటించారు. అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కూడా బిపిన్ రావత్ దంపతులకు నివాళులు అర్పించారు.
ఈ నెల 8న మధ్యాహ్నం 12:41 గంటలకు బిపిన్ రావత్, ఆయన సతీమణి మధూలిక రావత్, మరో 12 మంది మిలిటరీ సిబ్బందితో తమిళనాడులోని సూలూర్ నుంచి వెల్లింగ్టన్కు వెళ్తున్న హెలిక్యాప్టర్.. నీలగిరి దగ్గర కూనూరు కొండల్లో కుప్పకూలింది. ఆ వెంటనే మంటలు చెలరేగి కాలిపోయింది. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రావత్ సహా మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
Congress leader Rahul Gandhi pays tributes to CDS General Bipin Rawat, his wife Madhulika Rawat who lost their lives in the IAF chopper crash on Wednesday pic.twitter.com/ZjloO9gPgm
— ANI (@ANI) December 10, 2021
Delhi | Congress' senior leader Harish Singh Rawat pays tribute to CDS Gen Bipin Rawat.
— ANI (@ANI) December 10, 2021
He also paid last respects to CDS Gen Bipin Rawat's wife Madhulika Rawat pic.twitter.com/D0OkoQT5Su