మనోడైతే అలా.. పక్కోడైతే ఇలా!
‘మోదీ’ ఇంటి పేరు కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా తేల్చి రెండేండ్ల శిక్ష విధిస్తూ తీర్పునివ్వడం.. ఆ తర్వాతి రోజునే ఆయన ఎంపీ సభ్యత్వంపై వేటు వేయడం ఆగమేఘాలపై జరిగిపోయాయి.
- కోర్టు తీర్పు తర్వాత ఆగమేఘాలపై రాహుల్‌పై అనర్హత వేటు వేసిన కేంద్రం
- ఓ కేసులో కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేకు గత నెల రెండేండ్ల శిక్ష వేసిన ప్రత్యేక కోర్టు
- ‘ఏమో మాకు కనిపించదు’అన్నట్టు బీజేపీ తీరు
బెంగళూరు, మార్చి 25: ‘మోదీ’ ఇంటి పేరు కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా తేల్చి రెండేండ్ల శిక్ష విధిస్తూ తీర్పునివ్వడం.. ఆ తర్వాతి రోజునే ఆయన ఎంపీ సభ్యత్వంపై వేటు వేయడం ఆగమేఘాలపై జరిగిపోయాయి. ఇంత హడావుడి చేసిన బీజేపీ.. కర్ణాటకలో ఓ అవినీతి కేసులో దోషిగా తేలి, రెండేండ్ల జైలుశిక్ష పడిన హవేరీ ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్ (బీజేపీ) అనర్హత విషయంలో స్పందించలేదు. 2009-11 మధ్య సమయంలో కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నది.
ఆ సమయంలో హవేరీ ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ నేత ఓలేకర్ బంధుప్రీతితో అధికార దుర్వినియోగానికి పాల్పడి తన కుమారులకు కోట్ల రూపాయల కాంట్రాక్టులు దక్కేలా చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ అవినీతి ఆరోపణల కేసులో ఎమ్మెల్యే ఓలేకర్తో పాటు ఆయన ఇద్దరి కుమారులు, మరో ఆరుగురిని దోషులుగా తేలుస్తూ ప్రత్యేక కోర్టు గత నెల ఫిబ్రవరి 13న తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యేతో సహా అందరికీ రెండేండ్ల జైలు విక్ష విధించింది. కోర్టు తీర్పు మేరకు ఓలేకర్పై అనర్హత వేటు వేయాలి. కానీ, బీజేపీ పాలిత రాష్ట్ర సర్కారు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీనిపై ఇప్పుడు ప్రతిపక్షాలు బీజేపీని నిలదీస్తున్నాయి. ఇది ద్వంద్వ నీతి కాక మరేమిటని నిలదీస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

