న్యూఢిల్లీ, డిసెంబర్ 28: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ పేరు తొలిసారి ఈడీ చార్జిషీట్‌కు ఎక్కింది. హర్యానాలోని ఓ గ్రామంలో ఐదెకరాల భూమి క్రయవిక్రయాల కేసులో చార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ అధికారులు అందులో ప్రియాంక పేరును చేర్చారు.
ఆమె భర్త, ప్రముఖ వ్యాపారవేత్త ప్రియాంకవాద్రా పేరును కూడా అందులో చేర్చినప్పటికీ వీరిని నిందితులుగా మాత్రం పేర్కొనలేదు. ఎన్నారై వ్యాపారవేత్త సీసీ థంపి, భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు సుమిత్ చద్దాపై దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో వీరి పేర్లను ఈడీ ప్రస్తావించింది.