న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు శుక్రవారం సుప్రీం కోర్టులో ఊరట లభించింది. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ భార్య రింకీ భుయాన్ శర్మ దాఖలు చేసిన పరువు నష్టం ఫిర్యాదు విషయంలో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరైంది. రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారం ఒక వ్యక్తి వ్యక్తిగత స్వేచ్ఛను తేలిగ్గా ప్రమాదంలోకి నెట్టలేమనే వాస్తవాన్ని గుర్తించి ఈ దశలో బెయిల్‌ను మంజూరు చేసినట్టు ధర్మాసనం తెలిపింది.
ఒకవేళ ఖేరాను అరెస్ట్ చేస్తే సమంజసమైన నిబంధనల ప్రకారం ఆయనను బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది. అవసరమైనప్పుడు దర్యాప్తునకు హాజరు కావాలని ఖేరాను కోర్ట్ ఆదేశించింది.