బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ అసెంబ్లీ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లైంగికదాడి అనివార్యమైనప్పుడు దాన్ని ఎంజాయ్ చేయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను ఖండించకుండా స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కగేరి పగలబడి నవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతు సమస్యలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని కోరుతూ బుధవారం అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను డిమాండ్ చేస్తున్న సమయంలో స్పీకర్‌ను ఉద్దేశించి రమేశ్‌కుమార్ పైవ్యాఖ్య చేశారు. ‘ఒక సామెత ఉంది. లైంగికదాడి అనివార్యమైనప్పుడు, పడుకొని ఎంజాయ్ చేయాలి. మీరు ఉన్న స్థితి కూడా సరిగ్గా అదే’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై అసెంబ్లీలోని ఏ ఒక్క సభ్యుడు కూడా అభ్యంతరం చెప్పలేదు.