Padmakar Valvi : లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు బుధవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పద్మాకర్ వల్వి బీజేపీలో చేరారు. మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ భవన్కులే, పార్టీ నేత అశోక్ చవాన్ సమక్షంలో పద్మాకర్ బీజేపీలో చేరారు.
గతంలో పద్మాకర్ వల్వి షహద నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వ్యవహరించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతున్న క్రమంలో పద్మాకర్ రాజీనామా ఆ పార్టీలో ప్రకంపనలు రేపింది. మిలింద్ దియోరా, అశోక్ చవాన్ల తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడిన మూడో ప్రముఖ నేత పద్మాకర్ కావడం గమనార్హం.
Read More :