న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్(Digvijaya Singh) తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేసిన ఫోటో తీవ్ర దుమారాన్ని రేపుతున్నది. ఆయన ఆ ఫోటోపై చేసిన కామెంట్ కూడా పెను చర్చకు దారి తీస్తున్నది. 1990వ దశకానికి చెందిన ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను దిగ్విజయ్ సింగ్ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు. బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ను కూడా దిగ్విజయ్ తన పోస్టులో కొనియాడారు.
దిగ్విజయ్ పోస్టు చేసిన ఫోటోలో.. బీజేపీ నేత ఎల్కే అద్వాణీతో పాటు మోదీ కూడా ఉన్నారు. అణ్వాణీ కూర్చులో కూర్చున్నారు. ఆయన ముందు నేలపై మోదీ కూర్చున్నారు. బ్లాక్ అండ్ వైట్లో ఉన్న ఆ ఫోటోను దిగ్విజయ్ ట్వీట్ చేశారు. ఆ ఫోటోను ఖోరా సైట్లో కనుగొన్నానని, చాలా ఆసక్తికరంగా ఆ ఫోటో ఉందని, అట్టడుగు స్థాయిలో పనిచేసే ఆర్ఎస్ఎస్ వర్కర్లు, జన్ సంఘ నేతలు ఫోటోలో ఉన్నారని, నేలపై కూర్చున్న వ్యక్తి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అయినట్లు పేర్కొన్నారు. ఇది ఆ సంస్థ శక్తి అని, జై సియా రామ్ అంటూ దిగ్విజయ్ సింగ్ పోస్టు చేశారు.
అయితే ఆ ఫోటోను 1996లో తీసినట్లు తెలుస్తోంది. గుజరాత్ సీఎంగా శంకర్ సింఘ్ వాఘేలా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఆ ఫోటో తీసినట్లు భావిస్తున్నారు. కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న నియంతృత్వ, అప్రజాస్వామిక విధానాలను దిగ్విజయ్ ఎక్స్పోజ్ చేశారని బీజేపీ నేత సీఆర్ కేశవన్ ఆరోపించారు.
Will Rahul Gandhi show courage & react to the shocking Truth Bomb dropped by Shri. Digvijaya Singh’s tweet which has totally exposed how Congress first family ruthlessly runs the party in a dictatorial manner and also how autocratic & undemocratic this Congress leadership is? pic.twitter.com/5En2z9PLoF
— C.R.Kesavan (@crkesavan) December 27, 2025