Tushar Goyal | న్యూఢిల్లీ, అక్టోబర్ 3: ఢిల్లీలో బుధవారం పట్టుబడిన రూ.5,600 కోట్ల డ్రగ్స్ వెనుక ప్రధాన సూత్రధారి అయిన తుషార్ గోయల్ కాంగ్రెస్ నేత అని, ఆయన ఢిల్లీ పీసీసీ ఆర్టీఐ సెల్ మాజీ చైర్మన్ అని పోలీస్ వర్గాలు తెలిపాయి. ‘రాహుల్ ప్రేమ దుకాణంలో ఇప్పటివరకు విద్వేషమే లభించేది. ఇప్పుడు మాదకద్రవ్యాలు కూడా దొరుకుతున్నాయి’ అని బీజేపీ విమర్శించింది. ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ ఎక్స్‌లో ఖండిస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు తుషార్‌ను 2022 అక్టోబర్ లోనే పార్టీ నుంచి తొలగించినట్టు పేర్కొన్నది.
బెంగళూరు, అక్టోబర్ 3: కర్ణాటక కాంగ్రెస్ నేత, ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు హిందుత్వవాది సావర్కర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాంసాహారి అని, గోవధను వ్యతిరేకించ లేదంటూ పేర్కొన్నారు. ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సావర్కర్ స్వతాహాగా బ్రాహ్మణుడు అయినప్పటికీ ఆయన సంప్రదాయ ఆహార అలవాట్లకు కట్టుబడి లేరని, గొడ్డు మాంసాన్ని కూడా భుజించేవారని తెలిపారు.