SEBI Chairperson : సెబీ చీఫ్ మాధవి బుచ్‌పై కాంగ్రెస్ పార్టీ తాజా ఆరోపణలు గుప్పించింది. సెబీ చైర్‌పర్సన్‌గా ఉంటూ ఆమె లాభదాయక పదవిలో ఉన్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్, దాని అసెట్ మేనేజ్మెంట్ విభాగం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నుంచి నిరంతర ఆదాయం పొందుతున్నారని కాంగ్రెస్ మీడియా, పబ్లిసిటీ సెల్ చైర్మన్ పవన్ ఖేరా ఆరోపించారు. ఈ కంపెనీల్లో వేతనం తీసుకుంటూ ఆపై క్యాపిటల్ మార్కెట్స్ నియంత్రణ సంస్ధ సెబీ హోల్‌టైమ్ మెంబర్‌గా ఉంటూనే, చైర్పర్సన్ అయ్యారని తెలిపారు.
పవన్ ఖేరా సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మాధవి బుచ్ 2017 నుంచి 2024 మధ్య ఐసీఐసీఐ బ్యాంక్, ఐసీఐసీఐ ప్రుడెంట్ నుంచి వేతనంగా ఏకంగా రూ. 16.80 కోట్లు పొందారని చెప్పారు. 2017-18లో సెబీ చీఫ్ ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి వేతనంగా రూ. 2.06 కోట్లు పొందారని ఆరోపించారు. ఇలా 2024 వరకూ ఐసీఐసీఐ బ్యాంక్, ఐసీఐసీఐ ప్రుడెంట్ నుంచి వేతనాలు పొందారని అన్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ కోసం మాధవి బుచ్ నిబంధనలను సవరించారని పవన్ ఖేరా ఆరోపించారు.
ఇది లాభదాయక పదవికి విస్పష్ట ఉదాహరణని స్పష్టం చేశారు. సెబీ ఫుల్‌టైం మెంబర్ అయి ఐసీఐసీఐ నుంచి మీరు ఎందుకు వేతనం పొందారనేది తాము తెలసుకోవాలని అనుకుంటున్నామని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. సెబీలో భాగంగా సెబీ చైర్‌పర్సన్‌గా కొనసాగుతూ ఐసీఐసీఐ బ్యాంక్‌కు ఆమె ఏం సేవలు అందించారని ప్రశ్నించారు. ఇది సెబీ సెక్షన్ 54ను ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. మాధవి బుచ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని పవన్ ఖేరా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలపై సెబీ చీఫ్ ఇంతవరకూ స్పందించలేదు.
Read More :
Kollapur | కృష్ణానదిలో వరద నీటిలో చిక్కుకున్న చెంచులు, జాలర్లు