Remote Voting | ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఆర్వీఎం) విధానం తేవాలన్న ఎన్నికల సంఘం ప్రతిపాదనను ప్రధాన ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాలని నిర్ణయించాయి. ఎన్నికల సంఘం ప్రతిపాదనలో స్పష్టత లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆదివారం చెప్పారు. ఎన్నికల సంఘం ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో యునైటెడ్ జనతాదళ్, సీపీఐ, సీపీఎం, నేషనల్ కాన్ఫరెన్స్, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేతలు పాల్గొన్నారు.
ఆర్వీఎం ప్రతిపాదనపై రాజకీయంగా ఆందోళన కలిగిస్తున్నదని దిగ్విజయ్ సింగ్ అన్నారు. వలస కార్మికుల నిర్వచనంపై స్పష్టత లోపించిందన్నారు. న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగింది. ఆర్వీఎం ప్రతిపాదనపై రాజకీయ పార్టీల ప్రతినిధుల ముందు ఎన్నికల సంఘం ప్రదర్శించనున్న నేపథ్యంలో విపక్ష పార్టీలు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈసీ ప్రతిపాదనపై ఉమ్మడి వైఖరితో ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు దిగ్విజయ్ సింగ్ చెప్పారు.
ఈ సమావేశానికి సమాజ్వాదీ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేతలు హాజరు కాకపోయినా, విపక్ష పార్టీల వైఖరికి సంఘీభావం తెలిపారని దిగ్విజయ్ సింగ్ అన్నారు. గత నెల 29న కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రతిపాదనను తెచ్చింది. రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ విధానాన్ని తేవడం వల్ల ఓటింగ్ శాతం పెరుగుతుందని ఈసీ వాదించింది. ఒకవేళ ఈ విధానం అమల్లోకి వస్తే వలస కార్మికులు వారి సొంత జిల్లాలకు వెళ్లాల్సిన అవసరం లేదని చెబుతున్నది.