న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ దేశంలో ఎన్నికలను న్యాయంగా, స్వేచ్ఛగా నిర్వహిస్తున్నదీ, లేనిదీ పర్యవేక్షించేందుకు ‘ఈగిల్’ పేరిట కాంగ్రెస్ ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ లీడర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ (ఈగిల్)ను ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. మహారాష్ట్రలో ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఈ బృందం దృష్టి సారిస్తుంది. ఓ నివేదికను రూపొందించి, పార్టీ అధిష్ఠానానికి సమర్పిస్తుంది.