Supriya Shrinate | కంగనపై వివాదాస్పద పోస్ట్ చేసిన సుప్రియా శ్రీనాతేకు షాకిచ్చిన కాంగ్రెస్
Supriya Shrinate | బీజేపీ ఎంపీగా పోటీ చేయనున్న సినీ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut)పై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన సుప్రియా శ్రీనాతే (Supriya Shrinate)కు కాంగ్రెస్ (Congress) పార్టీ గట్టి షాక్ ఇచ్చింది.
Supriya Shrinate | బీజేపీ ఎంపీగా పోటీ చేయనున్న సినీ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut)పై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన సుప్రియా శ్రీనాతే (Supriya Shrinate)కు కాంగ్రెస్ (Congress) పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. ఎన్నికల వేళ వివాదానికి తెరతీసిన నేపథ్యంలో ఆమెకు టికెట్ నిరాకరించింది.
2019లో ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని మహరాజ్గంజ్ (Maharajganj ) నుంచి సుప్రియా శ్రీనాతే పోటీ చేసిన ఓడిపోయిన విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్థి పంకజ్ చౌదరి చేతిలో ఓటమిపాలైంది. అయితే ఈ సారి ఎలాగైన అదే స్థానం నుంచి గెలవాలని భావించిన శ్రీనాతేకు కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. కంగనతో రాజకీయ వివాదం నేపథ్యంలో తాజాగా విడుదల చేసిన లోక్సభ అభ్యర్థుల జాబితాలో ఆమెను పక్కకు పెట్టేసింది. ఆమె స్థానంలో పార్టీ తరఫున వీరేంద్ర చౌదరికి (Virendra Chaudhary) అవకాశం కల్పించింది.
కాగా, ప్రముఖ బాలీవుడ్ నటి అయిన కంగనా రనౌత్కు బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ మండి నుంచి కంగనను బరిలోకి దింపింది. ఈ క్రమంలో కంగనకు సంబంధించి సోషల్ మీడియాలో సుప్రియా పెట్టిన ఓ అభ్యంతరకర పోస్ట్ తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై కంగన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు కంగనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సుప్రియాకు ఎన్నికల సంఘం బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు అగౌరవంగా, దురుద్దేశంతో కూడుకుని ఉన్నాయని ఈసీ వ్యాఖ్యానించింది. తాము పంపిన షోకాజ్ నోటీసులకు ఈ నెల 29 సాయంత్రం లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు గౌరవంతో, హుందాగా వ్యవహరించాలని ఈసీ ఈ సందర్భంగా సూచించింది.
Also Read..
Mahua Moitra | ఈడీ విచారణకు మూడోసారీ డుమ్మా.. ఎన్నికలు పూర్తయ్యే వరకూ విచారణకు పిలవొద్దంటూ విజ్ఞప్తి
Leopard | అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం
Erode MP | టికెట్ ఇవ్వలేదని మనస్తాపం.. ఈరోడ్ ఎంపీ ఆత్మహత్య
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

