24 గంటలు గడవకుండానే జీ 23 కాంగ్రెస్ అసమ్మతి నేతలు మళ్లీ భేటీ అవుతున్నారు. సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ఇంట్లోనే రాత్రి 7 గంటలకు భేటీ అవుతున్నారు. బుధవారం నాడు హాజరైన 18 మంది నేతలందరూ కూడా నేటి భేటీకి హాజరవుతున్నారు. అయితే ఏఏ అంశాలను ఈ జీ23 చర్చించనుంది అనేది ఇంకా తెలిసి రాలేదు. అయితే.. భూపేందర్ సింగ్ హుడా నడిపిన రాయబారంపైనే ప్రధానంగా చర్చ జరగనుందని సమాచారం.
కాంగ్రెస్ సీనియర్ నేత, జీ 23 సమావేశానికి హాజరైన భూపేందర్ సింగ్ హుడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌తో భేటీ అయ్యారు. జీ 23 లో చర్చించిన అంశాలు, పార్టీ పరిస్థితిపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశం కాగానే.. హుటాహుటిన సీనియర్ నేత భూపేందర్ హుడా జీ 23 లో కీలక నేత అయిన గులాంనబీ ఆజాద్ ఇంటికి వెళ్లారు. ఈ సమావేశం తర్వాతే.. జీ 23 నేతల సమావేశం జరగడం గమనార్హం.