Karnataka CM | కర్ణాటక (Karnataka)లో ముఖ్యమంత్రి మార్పుపై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి (Karnataka CM) పీఠంపై డీకే శివకుమార్ (DK Shivakumar), సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) ఇద్దరూ చెరో రెండున్నరేళ్లు ఉంటారని సమాచారం. ఈ క్రమంలో మరో రెండు, మూడు నెలల్లో సీఎం మార్పు ఉంటుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి కాంగ్రెస్ ఇన్చార్జి, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా (Randeep Surjewala) చెక్ పెట్టారు. అలాంటి కసరత్తు ఏమీ జరగడం లేదని స్పష్టం చేశారు.
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిని చేయాలని ఆయన మద్దతుదారులు బహిరంగంగానే పిలుపునిస్తున్నారు. సుమారు 100 మంది ఎమ్మెల్యేలు డీకేకు మద్దతిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మంగళవారం పేర్కొన్న విషయం తెలిసిందే. ‘నేను ఒక్కడిని కాదు.. మెజారిటీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మార్పు కోరుకుంటున్నారు. 100 మందికిపైగా ఎమ్మెల్యేలు డీకే శివకుమార్‌కు మద్దతు ఇస్తున్నారు. వారిలో చాలా మంది మార్పు కోసం ఎదరుచూస్తున్నారు. మంచి పాలన కోరుకుంటున్నారు. సిద్ధరామయ్యను తొలగించి.. డీకే శివకుమార్‌ను సీఎంని చేయాలి.
ఆయన పార్టీ కోసం అవిశ్రాంతంగా పనిచేశారు. పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. కేపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ అభివృద్ధి అందరూ చూశారు. అందుకే మోజారిటీ ప్రజలు ఆయన్నే సీఎంగా కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి మార్పు అంశం గురించి నేను సుర్జేవాలాతో మాట్లాడతాను. ఇప్పుడు మార్పు జరగకపోతే.. 2028లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారాన్ని నిలుపుకోలేదు. ప్రస్తుతం పార్టీ ప్రయోజనాల దృష్ట్యా సీఎం మార్పు చాలా అవసరం’ అని అన్నారు. ఈ క్రమంలో సూర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ సీఎం మార్పు ఊహాగానాలకు చెక్ పెట్టారు. నాయకత్వ మార్పు లేదన్నదే తన జవాజు అని తేల్చి చెప్పేశారు. ‘నో’ అన్న ఒక్కపదంతో ఆ ఊహాగానాలకు తెరదించారు.
Also Read..
Plane Crash | విమాన ప్రమాదం.. ఎయిర్ ఇండియాపై దావాకు సిద్ధమైన బ్రిటన్ బాధిత కుటుంబాలు
Infosys | ఎక్కువ గంటలు పనిచేయొద్దు.. ఉద్యోగులకు ఇన్ఫీ కీలక సూచన
Baba Ramdev | సహజంగానే మనిషి ఆయుర్దాయం 150 నుంచి 200 ఏళ్లు : బాబా రామ్‌దేవ్