లక్నో: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన లఖీంపూర్ ఖేరీ ఘటనపై రాష్ట్రపతిని కలిసేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. ఈ మేరకు జాతీయ కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా తన మెమొరాండంను వెల్లడించింది. ఈ హింసాత్మక ఘటనకు సంబంధించిన వాస్తవాలను వివరించేందుకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరినట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. అయితే ఈమేరకు చేసిన ట్వీట్‌ను ఆ తర్వాత డిలీట్ కూడా చేసేసింది.
కానీ దీని స్క్రీన్షాట్లను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రాష్ట్రపతి భవన్‌కు పార్టీ పంపిన లేఖ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ.. ‘‘పట్టపగలు లఖీంపూర్ ఖేరీలో జరిగిన రైతుల ఊచకోత దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాల మెమొరాండంను రాష్ట్రపతి ముందు ఉంచేందుకు రాహుల్ గాంధీ నేతృత్వంలో డిలిగేషన్ ఏర్పడింది. దీనికోసం అత్యవసరంగా రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరుతోంది’’ అని పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
ఈ డిలిగేషన్లో రాహుల్‌తోపాటు పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, ఏకే ఆంటనీ, మల్లికార్జున ఖర్గే, గులాం నబీ ఆజాద్, అధీర్ రంజన్ చౌదరీ, ప్రియాంకా గాంధీ తదితరులు ఉన్నారు. అయితే ఈ ట్వీట్ చేసిన కాసేపటికే కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ఖాతాలో దీన్ని డిలీట్ చేశారు.
Lakhimpur Kheri violence | Congress seeks appointment with President Ram Nath Kovind for a 7-member party delegation led by Rahul Gandhi to present a detailed memorandum of facts pic.twitter.com/0rXZW44gye
— ANI (@ANI) October 10, 2021