ఇవ్వాళే.. పంజాబ్ ప్రచారానికి తెరపడనుంది. అయినా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేయలేదు. ఇంకా ఊగిసలాటలోనే ఉండిపోయింది. పీసీసీ చీఫ్ సిద్దూ, సీఎం చెన్నీ, ప్రచార కమిటీ అధ్యక్షుడు సునీల్ జాఖడ్, మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు ప్రతాప్ సింగ్ బాజ్వా.. ఈ నలుగురూ మేనిఫెస్టోపై దృష్టి సారించాల్సి వుంది. ఈ నలుగురి మధ్యే ఇంకా నలుగుతున్నట్లు తెలుస్తోంది. మేనిఫెస్టోపై కాంగ్రెస్ జనవరి 11 నుంచే కసరత్తు ప్రారంభించింది. 25 మందితో మేనిఫెస్టో కమిటీ, 31 మందితో ప్రచార కమిటీని నియమించింది. ఇంత ముందు చూపుతో వ్యవహారం చేసినా… మేనిఫెస్టో మాత్రం ఇంకా బయటకు రాలేదు.
ఇదే విషయంపై పీసీసీ చీఫ్ సిద్దూ జనవరి 25 న తాను రూపొందించిన మేనిఫెస్టోతో ఇతర సభ్యుల వద్దకు వెళకతారు. 13 సూత్రాలతో ఓ మోడల్‌ను రూపొందించారు. పంజాబ్ మేనిఫెస్టోలో సిద్దూ రూపొందించిన మోడల్ కచ్చితంగా అంతర్గతంగా ఉంటుందని కూడా మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు బాజ్వా ప్రకటించారు. శుక్రవారం ప్రచారానికి చివరి రోజు కావడంతో ఈ రోజు రిలీజ్ చేస్తారని అందరూ భావించారు. అయినా మేనిఫెస్టో విడుదల కాలేదు. అయితే దీనిపై మేనిఫెస్టో చైర్మన్ బాజ్వా విచిత్రంగా జవాబిచ్చారు. తాను ప్రచారంలో మునిగిపోయాయని, చండీగఢ్‌కు వెళ్లి, మేనిఫెస్టో విడుదల చేసే సమయం లేదని జవాబిచ్చారు.