న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సోమవారం ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఫిర్యాదు చేసింది. లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టోను ముస్లిం లీగ్ మేనిఫెస్టోతో పోల్చుతూ మోదీ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలల్లో మోదీ బొమ్మలు, భారీ కటౌట్లను తొలగించాలని డిమాండ్ చేసింది. పార్లమెంటు ఎన్నికల్లో పోరాడేందుకు అన్ని పార్టీలకు సమాన అవకాశాలు లభించేలా చూడాలని కోరింది.