గోధుమల ఎగుమతిపై కేంద్రం బ్యాన్ విధించింది. ఈ బ్యాన్పై కాంగ్రెస్ మండిపడింది. ఇది రైతు వ్యతిరేక నిర్ణయంగా అభివర్ణించింది. అధిక ఎగుమతి ధరల ప్రయోజనాలు రైతుకు అందకుండా పోతున్నాయని కాంగ్రెస్ పేర్కొంది. ఈ బ్యాన్పై చింతన్ శిబిర్ వేదికగా కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఆక్షేపించారు.
గోధుల ఉత్పత్తి తగ్గలేదని, అయితే గోధుమలను సేకరించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాట వాస్తవమని ఆయన పేర్కొన్నారు. ఈ బ్యాన్‌కు, గోధుమల ఉత్పత్తికి సంబంధం లేదన్నారు. కేంద్రం గనక గోధుమలను సరిగ్గా సేకరిస్తే, ఈ బ్యాన్ వచ్చి ఉండేదే కాదన్నారు. ఇలా చేయడంతో తానేమీ ఆశ్చర్యపోలేదని, మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమన్న విషయం తమకు తెలుసని చిదంబరం ఎద్దేవా చేశారు.
గోధుమల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం బ్యాన్ విధించింది. తక్షణమే ఆ నిషేధం అమలులోకి రానున్నది. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం వరకు ఎగుమతి కోసం క్రెడిట్ లెటర్ జారీ చేసే వాటికి మాత్రమే షిప్పింగ్‌కు అనుమతి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.