Lok Sabha Polls | లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ మరో 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీ నుంచి ఐదు స్థానాలు, బిహార్‌లో మూడు, ఒడిశాలో ఎనిమిది స్థానాలు, పశ్చిమ బెంగాల్లో ఒక స్థానానికి అభ్యర్థులను ఎంపిక చేసింది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కడప లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. కాకినాడ నుంచి ఎంఎం పల్లంరాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల (ఎస్సీ) జేడీ సలీం, కర్నూల్ రాంపుల్లయ్య యాదవ్ పోటీ చేయనున్నారు.
బిహార్‌లోని కిషన్‌గంజ్ నుంచి మహ్మద్ జావేద్, కతిహార్ నుంచి తాఖీద్ అన్వర్, భాగల్పూర్ అజీత్ శర్మకు టికెట్ల కేటాయించింది. ఒడిశాలోని భార్గర్ నుంచి సంజయ్ బోయి, సుందర్‌గఢ్ జనార్దన్ దేహురి, బోలంగిర్ మనోజ్ మిశ్రా, కలహండి ద్రౌపది మాఝీ, నబరంగ్‌పూర్ భుజ్‌బల్ మాఝీ, కంధమల్ అమీర్ చాంద్ నాయక్, బెర్హంపూర్ రష్మీ రంజన్ పట్నాయక్‌కు కేటాయించగా.. బెంగాల్‌లోని డార్జిలింగ్ సీటును మానుషి తమంగ్‌ను కేటాయిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేకే వేణుగోపాల్ జాబితాను విడుదల చేశారు. ఇక నిన్న తెలంగాణలోని వరంగల్, మహారాష్ట్రలోని అకోలా నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.