చండీఘఢ్ : మొహాలీలో పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ వింగ్ ప్రధాన కార్యాలయాన్ని గ్రనేడ్ ఢీకొన్న ఘటన నేపధ్యంలో భగవంత్ మాన్ సారధ్యంలోని ఆప్ సర్కార్‌పై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఇలాంటి ఘటనపై దర్యాప్తు చేపట్టే సామర్ధ్యం పంజాబ్ సర్కార్‌కు లేదని ఆ పార్టీ దుయ్యబట్టింది.
ఈ ఘటనకు సంబంధించి విచారణలో కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దింపాలని కాంగ్రెస్ ప్రతినిధి జైవీర షెర్గిల్ మంగళవారం పేర్కొన్నారు. రాష్ట్ర భద్రతకు ఆప్ ప్రభుత్వం పెనుముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో కేజ్రీవాల్ ప్రచార్ మంత్రిగా కాకుండా భగవంత్ మాన్ పంజాబ్ సీఎంగా వ్యవహరించాలని జైవీర్ షెర్గిల్ హితవు పలికారు.
మొహాలీలోని పోలీస్ ప్రధాన కార్యాలయంపై దాడి ఘటన ప్రభుత్వ యంత్రాంగానికి ఓ హెచ్చరిక సంకేతమని వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ ఘటనపై సీఎం మాన్ స్పందిస్తూ మొహాలీ పేలుడుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారని, పంజాబ్‌లో ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేసేందుకు ప్రయత్నించే వారిని విడిచిపెట్టమని హెచ్చరించారు.