న్యూఢిల్లీ, ఏప్రిల్ 24 : విడుదల కాకుండానే ఒక కృత్రిమ మేధ (ఏఐ) మోడల్ ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ వ్యవస్థలను భయపెడుతున్నది. ఆ ఏఐ మోడలే ఆంథ్రోపిక్‌కు చెందిన క్లాడ్ మైథోస్. బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లో లోపాలను కనిపెట్టేందుకు కనుగొన్న ఏఐ మోడలే ఆంథ్రోపిక్ మైథోస్. ఇది సైబర్ సెక్యూరిటీ లోపాలను గుర్తించడంతో పాటు పరిష్కారాలను కూడా చెబుతుంది. అయితే ఈ మోడల్ నేరగాళ్ల చేతికి చిక్కితే ఏమవుతుందన్న భయం అటు బ్యాంకింగ్, ఇటు టెక్నాలజీ రంగాన్ని కలవరపరుస్తున్నది.
ఇది మనుషుల కంటే మెరుగైన పనితీరును కనబరచడంతో పాటు హ్యాకింగ్ టాస్క్‌లను చేపట్టింది. దీంతో దీనిని మార్కెట్లో విడుదల చేయడం ఆపేశారు. అయితే ఈ 12 కంపెనీలే కాక మరికొన్ని అనధికారికంగా దీనిని యాక్సెస్ చేశాయన్న విషయం బయటపడింది. దీంతో మరిన్ని భయాందోళనలు నెలకొన్నాయి. ఏఐ మోడల్ ప్రభావాన్ని అంచనా వేయడానికి ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ ఈ నెల మొదట్లో, మన దేశంలోనూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ అత్యవసర సమావేశం నిర్వహించారు.