పశ్చిమ బెంగాల్లో ప్రారంభమైన సంపూర్ణ లాక్డౌన్
సంపూర్ణ లాక్డౌన్| కరోనా ఉధృతి నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ విధించింది. ఉదయం ఆరు గంటల నుంచి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.

కోల్‌కతా: కరోనా ఉధృతి నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ విధించింది. ఉదయం ఆరు గంటల నుంచి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఆంక్షలు ఈ నెల 30వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు అమలులో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. సంపూర్ణ లాక్డౌన్ సందర్భంగా పరిశ్రమలు, మెట్రో సర్వీసులు, అంతర్రాష్ట్ర రైళ్లు, బస్సులను నిలిపివేశారు. అన్నిరకాల సమావేశాలపై నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నది. రాష్ట్రంలోని తేయాకు తోటల్లో 50 శాతం కార్మికులు పనిచేసేలా వెసులుబాటు కల్పించింది. జనపనార మిల్లుల్లో 30 శాతం కార్మికులు పనిచేసేందుకు అనుమతించింది. అత్యవసర సేవలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు నిచ్చారు. ప్రజలు తమకు అవసరమైన వస్తువులను కొనుక్కునేందుకు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు దుకాణాలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది.
పశ్చిమబెంగాల్లో నిన్న 20,846 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 10,94,802కు చేరాయి. ఇందులో 1,31,792 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 9,50,017 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 12,993 మంది మృతిచెందారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కరోనా సమస్యలతో సీనియర్ జర్నలిస్టు మృతి
నిర్లక్ష్యంతో బ్లాక్‌ఫంగస్ ప్రాణాంతకం
కొవాగ్జిన్, కొవిషీల్డ్ సమర్థవంతమే!
ఫైజర్, మోడెర్నా తక్కువ ప్రభావవంతం
2 డోసులు తీసుకున్నా మాస్క్ ధరించాలి
జూలై నాటికి 50 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిన కారు..ఆరుగురికి గాయాలు
woman found dead | మహిళ సూసైడ్.. ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నతాధికారి అరెస్ట్
Parvinder Singh Jhota | పర్వీందర్ సింగ్ ఝోటా హత్య కేసు.. డీఎస్పీ సహా డ్రగ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్
Arrest | హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
AP News | వైఎస్ జగన్ ఒక క్రిమినల్ లిటిగెంట్.. రాజకీయాల్లో ఇలాంటి వాళ్లు ప్రమాదకరం : చంద్రబాబు
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

