న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరను రూ. 6 పెంచినట్టు చమురు మార్కెటింగ్ కంపెనీలు శనివారం ప్రకటించాయి. దీంతో సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1,797 నుంచి రూ. 1,803కి పెరిగింది. గడచిన ఐదేండ్లలో తాజాగా పెరిగిన రూ.6 పెంపు అతి తక్కువదని చెప్పవచ్చు.
ఐఓసీ ధరల ప్రకారం 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర చెన్నైలో రూ.1,955 ఉంటుంది. 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల ధరలు 2024 ఆగస్టు నుంచి ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి.