న్యూఢిల్లీ : హోటళ్లు, రెస్టారెంట్లలో వాడే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. సవరించిన చార్జీల ప్రకారం 19 కేజీల సిలిండర్ ధర రూ.41 తగ్గింది. దీంతో వాణిజ్య సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1,762, ముంబైలో 1,713.50, చెన్నైలో 1,921.50 రూపాయలకు చేరింది. గృహావసరాలకు వాడే గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. అలాగే విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధర కిలోలీటర్‌కు 6.15 శాతం చొప్పున రూ.5,870.54 తగ్గింది. ధరల సవరణ అనంతరం ఏటీఎఫ్ కిలో లీటర్ ధర ముంబైలో రూ.83,575.42, చెన్నైలో 92,503.80గా ఉంది.