భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర.. ఒకేసారి రూ.273.5 వడ్డింపు
Commercial cylinder | నిన్నటివరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన దేశీయ చమురు కంపెనీలు.. ఇప్పుడు వాణిజ్య అవసరాలకోసం వినియోగించే సిలిండర్‌పై భారీగా వడ్డించాయి. ఒకేసారి రూ.273.5 పెంచాయి. దీంతో హైదరాబాద్ కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ (Commercial cylinder) ధర రూ.2460కి చేరింది.
న్యూఢిల్లీ: చమురు ధరల మోత ఇప్పట్లో ఆగేలా లేదు. నిన్నటివరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన దేశీయ చమురు కంపెనీలు.. ఇప్పుడు వాణిజ్య అవసరాలకోసం వినియోగించే సిలిండర్‌పై భారీగా వడ్డించాయి. ఒకేసారి రూ.273.5 పెంచాయి. దీంతో హైదరాబాద్ కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ (Commercial cylinder) ధర రూ.2460కి చేరింది.
ఇక దేశరాజధాని న్యూఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.250 పెరిగింది. దీంతో రూ.2253కు చేరింది. అయితే ప్రస్తుతానికి గృహ అవసరాలకోసం వినియోగించే 14 కిలోల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేకపోవడం కొంతలో కొంత ఊరటనిస్తున్నది. కాగా, గతనెల 1న 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.105 మేర పెంచిన విషయం తెలిసిందే.
19 kg commercial cooking gas LPG price hiked by Rs 250 per cylinder. It will now cost Rs 2253 effective from today. No increase in the prices of domestic gas cylinders. pic.twitter.com/h8acfRh6mn
— ANI (@ANI) April 1, 2022
10 రోజుల్లో రూ.7 వడ్డన
మార్చి 22 నుంచి గత పదిరోజుల్లో తొమ్మిది సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు అధికమయ్యాయి. మొత్తంగా లీటర్ పెట్రోల్‌పై రూ.7.22, లీటర్ డీజిల్‌పై రూ.6.96 చొప్పున ధరలు పెరిగాయి. దీంతో హైదరాబాద్‌లో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.115.42, డీజిల్ రూ.101.58గా ఉంది. కాగా, గత నెలలోనే గృహావసరాలకు వినియోగించే సిండర్ ధర రూ.50 పెరిగిన సంగతి విధితమే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Books Launch | తెలుగు సాహితీ వికాస వేదిక ఆధ్వర్యంలో ఘనంగా పుస్తకాల ఆవిష్కరణ
Gold in Rapido | ర్యాపిడోలో బంగారం పంపిస్తే.. ఆభరణాలతో ఉడాయించిన డ్రైవర్!
‘విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తయారు చేయడంలో సైన్స్ కాంగ్రెస్ దోహదం’
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Beauty Tips | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

